Sat Mar 07 2026 17:05:05 GMT+0530 (India Standard Time)
ఆ మరణాలకు బాధ్యత జగన్ ప్రభుత్వానిదే
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ అందక మరణించిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ అందక మరణించిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని [more]

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ అందక మరణించిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని రామకృష్ణ తెలిపారు. హిందూపురం కర్నూలు, అనంతపురం, విజయనగరాల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో మరణంచారని రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం 480 టన్నుల ఆక్సిజన్ నిల్వలే ఏపీలో ఉన్నాయని కేసులు పెరుగుతుంటే మరింత ఆక్సిజన్ అవసరమవుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రామకృష్ణ సూచించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story