Thu Mar 19 2026 02:41:55 GMT+0530 (India Standard Time)
రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

న్యూఢిల్లీ : రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఈనెల 31 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
తెలంగాణ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూన్ 1వ తేదీన రాజ్యసభ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన, జూన్ 3వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ ఉంటుంది.
Next Story

