Sun Feb 01 2026 22:53:29 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు మాకు మిత్రుడే

ఎన్డీఏ నుంచి వెళ్లిపోయినా, రాజకీయాలు ఎలా ఉన్నా చంద్రబాబు తమ మిత్రుడే అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చామని, గుంటూరు, విజయవాడకు అదనంగా మరో 1000 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,750 కోట్లు ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేశామని, వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే చాలా హామీలు అమలు చేశామని, మిగతావి కూడా నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.
Next Story

