Fri Mar 27 2026 07:37:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజస్థాన్ సీఎం ఆయనే...?

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ పేరునే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేసులో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ లు పోటీ పడుతున్నారు. ఇద్దరితో కొద్దిసేపటి క్రితం సమావేశమయిన రాహుల్ గాంధీ వారితో చర్చించారు. చివరకు అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ తో భేటీ తర్వాత అశోక్ గెహ్లాట్ జైపూర్ బయలుదేరి వెళ్లడంతో ఆయన పేరును రాహుల్ కన్ఫర్మ్ చేశారనిచెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇప్పటికే కమల్ నాధ్ పేరుకు రాహుల్ టిక్ పెట్టారని తెలుస్తోంది.
Next Story

