రజనీ....నువ్వు నువ్వేనయ్యా....?

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పారు. ఇంకా పార్టీ పెట్టలేదు. అయితే ఆయన వేసే ప్రతి అడుగూ బీజేపీకి అనుకూలంగా ఉందన్న వార్తలు గతంలోనే వచ్చాయి. రజనీకాంత్ కు కమలం వాసనలు ఉన్నాయని సహచర నటుడు కమల్ హాసన్ కూడా అనేకసార్లు విమర్శించారు. అయితే రజనీ తాజా వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మోడీ జమిలీ ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో ఉన్నారు. జమిలీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది.
జమిలీకి జై......
అయితే జమిలీ ఎన్నికలకు అధిక శాతం పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, తెలుగుదేశం పార్టీ వంటివి వ్యతిరేకించాయి. ఎన్డీఏ మిత్రపక్షమైన అకాళీదళ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అన్నాడీఎంకే, జమిలి ఎన్నికలను సమర్ధించాయి. అయితే తాజాగా రజనీ కూడా జమిలీ ఎన్నికలకు జై కొట్టారు. ఇది మంచి ఆలోచన అని, దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని రజనీ అభిప్రాయపడ్డారు. దీంతో రజనీ బీజేపీకి దగ్గరవుతున్నారని ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచారానికి మరింత పట్టు చేకూరింది.
