Sun Mar 22 2026 15:36:59 GMT+0530 (India Standard Time)
ఎంఐఎం నేతలు ఫేస్ బుక్ హ్యాక్ చేయించారు

గోషామహల్ బిజెపి మాజీ ఎమ్మెల్యే, హిందుత్వ నేత రాజా సింగ్ ఫేస్ బుక్ ను కొందరు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగా ఎంఐఎం పార్టీ నేతలే హ్యాక్ చేయించనట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోషామహాల్ నుండి నన్ను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజారిటీతో మళ్లీ గెలుస్తానని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story

