Thu Mar 19 2026 12:05:18 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట నిరాహార దీక్షకు సిద్ధపడ్డ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవులను రక్షిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మంగళవారం బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ ముందు నిరాహార దీక్ష చేయాలని భావించారు. సోమవారం సాయంత్రం నుంచే ధూల్ పేట్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు మొహరించారు. మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. అయితే, బక్రీద్ పండుగ నేపథ్యంలో పాతబస్తీలో గోవులను వధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజా సింగ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పాతబస్తీలో ఉన్న గోవులను గోశాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story

