Fri Jan 30 2026 17:13:02 GMT+0000 (Coordinated Universal Time)
బర్త్ డే కు రాజ్ థాక్రే భలే ఆఫర్

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాక్రే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు భలే ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం భారీగా పెరిగిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట ఇచ్చేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఇవాళ పెట్రోల్ పొయించుకుంటున్న వారికి లీటర్ పై రూ.4 డిస్కౌంట్ ప్రకటించింది ఆ పార్టీ. అంటే ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఏర్పడిన లోటును మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇవ్వనుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఇవాళ ఒక్కరోజు మాత్రమే. అదికూడా కేవలం ద్విచక్ర వాహనదారులకే. ముంబైలోని 36 పెట్రోల్ బంకులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 12 బంకుల్లో ఈ ఆఫర్ ప్రకటించింది పార్టీ. దీంతో వాహనదారుల్లో రాజ్ థాక్రే కు మంచి మార్కులే పడ్డాయంటున్నారు.
Next Story

