Thu Mar 19 2026 10:39:09 GMT+0530 (India Standard Time)
మంత్రుల చాంబర్లలోకి వరద నీరు

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలోకి మరోసారి నీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు సచివాలయం లోపలికి చేరింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్ రెడ్డి చాంబర్ లలో పూర్తిగా వరద నీళ్లు నిండిపోయాయి. దీంతో సిబ్బంది నీళ్లు తొలగించేందుకు కష్టపడుతున్నారు. గతంలోనూ ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి పలుమార్లు వరదనీరు చేరింది. ఓసారి ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చాంబర్ లోకి కూడా ఇలానే నీళ్లు వచ్చాయి. అయితే, అప్పుడు ఇందులో కుట్ర ఉందని, ఎవరో పైపులు కట్ చేశారని మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపించారు. తర్వాత కూడా మళ్లీ ఇలా నీళ్లు వస్తుండటం, సీలింగ్ లు విరిగిపోతుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
Next Story

