Mon Mar 16 2026 08:43:21 GMT+0530 (India Standard Time)
జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన మరోసారి లీకేజీలకు గురయ్యింది. పెథాయ్ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అమరావతిలోనూ ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం కారణంగా అసెంబ్లీ లీకేజీ గురై లోపలికి నీరు చేరింది. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లో నీరు చేరింది. నీటిని వెంటనే అసెంబ్లీ సిబ్బంది తొలగిస్తున్నారు. గతంలోనూ అసెంబ్లీ భవనంలో ఇదేరీతిలో వర్షానికి నీరు చేరిన విషయం తెలిసిందే.
Next Story

