Mon Mar 23 2026 06:42:41 GMT+0530 (India Standard Time)
ప్రధాని పదవిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని పదవిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి నోరు విప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తానే ప్రధానినవుతానేమోనని రాహుల్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న రాహుల్ మీడియా ఎదుట తన మనసులో మాట చెప్పారు. ఈ సందర్భంగా మోడీ పాలనపై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రధాని చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. ప్రజలను మోసం చేయడమే మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. జీఎస్టీ,నోట్ల రద్దుతో బావుకుందేమీ లేకున్నా, ప్రజలకు మాత్రం కష్టాలు మిగిిచ్చారు. 35 వేల కోట్ల రూపాయలను దోచుకున్న గాలి వర్గానికి ఎందుకు 8 సీట్లు ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. అవినీతి ఆరోపణలున్న యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారని నిలదీశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చిన మోడీ ఎందుకు తప్పారో యువతకు సమాధానం చెప్పాలన్నారు.
Next Story

