Thu Mar 19 2026 04:38:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నా వివాహం జరిగిపోయింది

తన పెళ్లి విషయమై హైదరాబాద్ లో జరిగిన మీడియా ఎడిటర్ల సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో తన వివాహం జరిగిపోయిందన్నారు. పెళ్లి ఎప్పుడు అని మీడియా ఎడిటర్ల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా రాహుల్ పై విధంగా స్పందించారు. పార్టీ విధానాలను విస్తరించడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఊహల్లో బతుకుతున్నారని, 2019లో ఆయన ప్రధాని కావడం కలనే అని పేర్కొన్నారు. బీజేపీకి 230 సీట్లు రాకుంటే మోడీ ప్రధాని కాలేరని స్పష్టం చేశారు. యూపీ, బిహార్ లో పొత్తుల కారణంగా బీజేపీకి 230 సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో రావడం అసాధ్యమేనని తేల్చారు.
Next Story

