Sun Feb 01 2026 11:35:57 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీని కలిసి రజనీ డైరెక్టర్

సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు తీసిన దర్శకుడు పా రంజీత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం ఆసక్తికరంగా మారింది. పా రంజీత్ తో పాటు, మద్రాస్ సినిమా నటుడు కలయరాసన్ రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీనే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాము, రాజకీయాలు, సినిమాలు, సమాజంపై చర్చించామని రాహుల్ తెలిపారు. పా రంజీత్ తీసిన సినిమాల్లో పేదల జీవితాలు ప్రతిబింబిస్తాయి. కబాలితో పోలిస్తే ధారావి నేపథ్యంతో తెరకెక్కించిన కాలా సినిమా బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశపరిచినా, పా రంజీత్ సిద్ధాంతాలు మాత్రం బాగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్ దర్శకుడితో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరమే.

Next Story

