Fri Jan 30 2026 13:02:14 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ చెబితేనే చేస్తా

అనూహ్య పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి తాను ప్రజల దయతో ముఖ్యమంత్రిని కాలేదని, కాంగ్రెస్ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. అయినా తాజాగా మళ్లీ కుమరస్వామి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కుమారస్వామి ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుమారస్వామిపై బీజేపీ, రైతు సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పలువురు రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తాను ఇచ్చిన హామీని అమలు చేయాలంటే ముందు కాంగ్రెస్ పార్టీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాను రాహుల్ గాంధీ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని మరోసారి చెప్పారు. రుణ మాఫీ గురించి రాహుల్ తో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు.
Next Story

