Sun Mar 22 2026 20:15:22 GMT+0530 (India Standard Time)
రంగంలోకి రాహుల్ గాంధీ

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీల అగ్రనేతలు ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు బహిరంగ సభలు నిర్వహించి అందరి కంటే ముందున్నారు. ఇక తెలంగాణలో ఎలాగైనా ప్రభావం చూపాలని అనుకుంటన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కరీంనగర్ లో, మహబూబ్ నగర్ లో బహిరంగ సభలు నిర్వహించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇక కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ఉదృతం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు మహబూబ్ నగర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఆయన ఈ నెల 20న కామారెడ్డిలో, 27వ తేదీన వరంగల్, కరీంనగర్ లో పర్యటించనున్నారు.
Next Story

