Thu Mar 19 2026 13:53:41 GMT+0530 (India Standard Time)
రాహుల్ రాజీనామా… తిరస్కరించిన సీడబ్లూసీ
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక [more]
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక [more]

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా సోనియా గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆయనను వారించారు. అయినా రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, రాహుల్ గాంధీ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కిరించింది. ఆయన నాయకత్వంలోనే పార్టీ ఉంటుందని సీడబ్లూసీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడానికి ఇవాళ ఢిల్లీలో సీడబ్లూసీ సమావేశం జరుగుతోంది.
Next Story