Fri Mar 20 2026 02:54:30 GMT+0530 (India Standard Time)
రాహుల్ గాంధీకి చైనాపై ప్రేమ ఎక్కువ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర్ యాత్ర వివాదాస్పదమవుతోంది. భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ యాత్రపై ఆరోపణలు గుప్పిస్తోంది. రాహుల్ పర్యటనలో భాగంగా డోక్లాంలో చైనా నేతలతో రహస్యంగా సమావేశమయ్యారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జర్మనీ పర్యటనలోనూ రాహుల్ గాంధీ చైనాను సమర్థించారని విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీకి చైనాపై ప్రేమ ఎక్కువని, చైనాపై ఆయనకు ఉన్న నమ్మకం మన ప్రభుత్వంపై లేదని ఆరోపిస్తున్నారు. అయితే, ఇటీవల రాఫేల్ డీల్ ఒక అంతర్జాతీయ కుంభకోణమని రాహుల్ గాంధీ బీజేపీపై ఆరోపణలు గుప్పించడం, వాటిపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో వాటి నుంచి పక్కదోవ పట్టించడానికే బీజేపీ రాహుల్ పై ఆరోపణలు చేస్తోందని పలువురు కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Next Story

