Fri Jan 30 2026 22:21:23 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ తో బాబు భాయీభాయీ

కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికగా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చాలానే కనపడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు వేదికపైకి వచ్చారు. వేదికపై కూడా వారిద్దరితో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. అనంతరం రాహుల్ గాంధీతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఇటీవలే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఈ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినట్లే అయింది. అయితే రాహుల్ గాంధీతో కలిసి ప్రజలకు అభివాదం చేయడం కేవలం కాకతాళీయమేనా లేదా అంతర్లీనంగా ఏమైనా సూచనలు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.
Next Story

