Thu Mar 19 2026 06:00:57 GMT+0530 (India Standard Time)
రాహుల్ భేటీలో టీడీపీ నేతల వారసులు

తెలంగాణ పర్యటనలో భాగంగా తాజ్ కృష్ణ హోటల్ లో పారిశ్రామికవేత్తలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామిక వేత్తలు, నాయకుల వారసులు వరుస కట్టి హాజరయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణితో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రాహుల్ సమావేశంలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ముగియనుంది. అయితే, మొదట ఈ సమావేశానికి మీడియాను అనుమతించి ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం ఇస్తామని టీపీసీసీ చెప్పి... చివరి నిమిషంలో మీడియాను అనుమతించకుండా నిర్వహిస్తున్నారు.
Next Story

