Thu Mar 19 2026 03:14:52 GMT+0530 (India Standard Time)
కారు స్టీరింగ్ పట్టుకోకండి..!

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ శేరిలింగంపల్లిలో జరిగిన రాహుల్ గాంధీ సభలో ఆయన మాట్లాడుతూ... మనం అన్నదమ్ముల్లా మాత్రమే విడిపోయామని పేర్కొన్నారు. తెలుగువారిని నరేంద్ర మోదీ మోసం చేశారని, విభజన హామీలు అమలు చేయడం లేదన్నారు. మొదట ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించారని విమర్శించారు. ఇక కారు స్టీరింగ్ పట్టుకోవద్దని, కారు టైర్లు అరిగి పంచర్లు అయ్యాయని ప్రజలను కోరారు. 2019 ఆగస్టు 15 ప్రధాని హోదాలో ఎర్రకోటపై రాహుల్ గాంధీ జెండా ఎగరేస్తారన్నారు.
Next Story

