Sun Mar 15 2026 13:23:44 GMT+0530 (India Standard Time)
జగన్ ఆ నిర్ణయం వాయిదా వేసుకోండి..లేకుంటే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. పాఠశాలలు ఇప్పుడే ప్రారంభించవద్దని కోరారు. ఏపీలో రోజుకు పదవేల కేసులు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. పాఠశాలలు ఇప్పుడే ప్రారంభించవద్దని కోరారు. ఏపీలో రోజుకు పదవేల కేసులు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. పాఠశాలలు ఇప్పుడే ప్రారంభించవద్దని కోరారు. ఏపీలో రోజుకు పదవేల కేసులు నమోదవుతున్నాయన్న విషయం రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, పాఠశాలలను ప్రారంభిస్తే వారు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టంబరు 5వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోమని రఘురామకృష్ణంరాజు సూచించారు.
Next Story