Sun Mar 15 2026 14:58:55 GMT+0530 (India Standard Time)
మళ్లీ రాజుగారు…?
వైసీపీ పార్లమెంటు సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ లైన్ దాటేశారు. ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ [more]
వైసీపీ పార్లమెంటు సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ లైన్ దాటేశారు. ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ [more]

వైసీపీ పార్లమెంటు సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ లైన్ దాటేశారు. ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ తర్వాత రఘురామ కృష్ణంరాజు కేంద్ర మంత్రులతోనే భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపైనా, నియోజకవర్గ సమస్యలపైనా వైసీపీ ఎంపీలు అందరూ కలసి కేంద్రమంత్రులను కలుస్తుంటారు. కానీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ఒంటరిగానే కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ తన వద్దకు పిలిపించుకుని రఘురామకృష్ణంరాజుకు క్లాస్ పీకినా ఆయనలో మార్పు రాలేదన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఈరోజు కూడా పలువరు కేంద్రమంత్రులతో రఘురామకృష్ణంరాజు అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
Next Story