Sun Mar 15 2026 16:38:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తన ఫోన్ ఏపీ ఇంటలిజెన్స్ ట్యాప్ చేస్తుందని?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆరోపిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లాకు లేఖ రాశారు. [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆరోపిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లాకు లేఖ రాశారు. [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆరోపిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లాకు లేఖ రాశారు. ఏపీ ఇంటలిజెన్స్ విభాగం తన ఫోన్ ట్యాప్ చేసిందని రఘురామ కృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పెయిన్, దక్షిణకొరియా, రుమేనియా వంటి దేశాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక ఎంపీగా, పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా తాను సహచర సభ్యులతో మాట్లాడిన మాటలు బహిర్గతమయితే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తన ఫోన్ కు పదే పదే అంతరాయం రావడంతో తనకు అనుమానం వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
Next Story