Mon Mar 16 2026 01:25:52 GMT+0530 (India Standard Time)
హైకోర్టుకు రఘురామ కృష్ణంరాజు… షోకాజ్ నోటీస్ పై
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషన్ ను తాను కొన్ని [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషన్ ను తాను కొన్ని [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషన్ ను తాను కొన్ని వివరణలను కోరారని, అవి వచ్చేంత వరకూ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ లో పేర్కొన్నారు. షోకాజ్ నోటీసుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చేంత వరకూ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రఘురామ కృష్ణంరాజు పై అనర్హత పిటీషన్ ను స్పీకర్ కు ఇచ్చేందుకు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళుతున్న సమయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడం విశేషం.
Next Story