Sun Mar 15 2026 18:41:01 GMT+0530 (India Standard Time)
రాజు గారి ఘాటు రిప్లై
వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘరామ కృష్ణంరాజు రిప్లై ఇచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని రఘురామ [more]
వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘరామ కృష్ణంరాజు రిప్లై ఇచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని రఘురామ [more]

వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘరామ కృష్ణంరాజు రిప్లై ఇచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారన్నారు. వైసీపీలో క్రమశిక్షణ సంఘం అనేది ఉందా? లేదా? ఉంటే దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎవరో తనకు తెలపాలని, క్రమశిక్షణ సంఘం మినిట్స్ తనకు పంపాలని రఘురామ కృష్ణంరాజు ఘాటుగా సమాధానమిచ్చారు.
Next Story