Sun Mar 08 2026 06:30:46 GMT+0530 (India Standard Time)
దొంగలెక్కలు వేయడంలో విజయసాయి…?
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. తన స్థాయి గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. ఆయన [more]
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. తన స్థాయి గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. ఆయన [more]

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. తన స్థాయి గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. ఆయన త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతారేమో తెలియదని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. దొంగలెక్కలు చూపించడంలో విజయసాయి ఘనాపాటి అని రఘురామ కృష్ణరాజు విమర్శించారు. తలకాయ ఉన్నవాడిని ఒక్కడినైనా పక్కనపెట్టుకోమని జగన్ కు సూచిస్తున్నానని రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రభుత్వాలు న్యాయం చేయకపోయినా, న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
Next Story