Sun Mar 15 2026 16:33:43 GMT+0530 (India Standard Time)
ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఆయన అభ్యంతరం తెలిపారు. రంగులు వేయడంపై స్పెషల్ లీవ్ పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్న విషయాన్ని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రంగుల కోసం ఎంత ఖర్చుపెట్టామో ప్రజలకు చెప్పాలన్నారు. మార్చిన రంగుల స్థానంలో పాత రంగులు వేయాలని రఘురామ కృష్ణరాజు తాను రాసిన లేఖలో కోరారు.
Next Story