Sun Mar 15 2026 11:52:40 GMT+0530 (India Standard Time)
చెత్త పనులు నిలిపేయండి.. జగన్ కు రాజు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తిపన్ను పెంచడాన్ని ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తిపన్ను పెంచడాన్ని ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తిపన్ను పెంచడాన్ని ఆయన తప్పు పట్టారు. చెత్తతో సహా వివిధ పన్నులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రఘురామ కృష్ణరాజు జగన్ కు లేఖ రాశారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్తిపన్ను పెంచడంతో పాటు చెత్త పన్ను కూడా వేస్తుండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. స్లాబ్ లతో విద్యుత్తు బిల్లులు కూడా పెరిగి పేదలకు భారంగా మారిందని రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు.
Next Story