Sun Mar 15 2026 18:54:55 GMT+0530 (India Standard Time)
రఘురామ ఈరోజు జగన్ కు రాసిన లేఖలో?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మూడు రోజుల నుంచి వరసగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తున్నారు. నేడు కూడా లేఖ రాశారు. ప్రతి [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మూడు రోజుల నుంచి వరసగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తున్నారు. నేడు కూడా లేఖ రాశారు. ప్రతి [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మూడు రోజుల నుంచి వరసగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాస్తున్నారు. నేడు కూడా లేఖ రాశారు. ప్రతి ఏటా జనవరి నెలలో ఉద్యోగాల భర్తీ క్యాలండర్ విడుదల చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, అయితే ఇది అమలు కావడం లేదని రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. ఈ హామీతోనే గత ఎన్నికల్లో నిరుద్యోగుల మద్దతు లభించిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఉగాదికే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూశారని, వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి క్యాలండర్ ను ప్రకటించాలని రఘురామ కృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
Next Story