Sun Mar 15 2026 16:33:42 GMT+0530 (India Standard Time)
నందిగం మతంపై విచారణ చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు రావడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్ మాస్క్ పెట్టుకుని మాట్లాడితే [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు రావడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్ మాస్క్ పెట్టుకుని మాట్లాడితే [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు రావడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్ మాస్క్ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. నందిగం సురేష్ పై కూడా రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేశారు. మదర్ ఫ్లోరా ఫైత్ మినిస్ట్రీస్ సర్వీస్ సొసైటీలో నందిగం సురేష్ సభ్యుడన్నారు. హిందూ దళితుడైన నందిగం సురేష్ ఆ క్రైస్తవ సంస్థలో సభ్యుడెలా అవుతారని ప్రశ్నించారు. ఆ సంస్థకు విదేశీనిధులు 17 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. నందిగం సురేష్ మతం పైవిచారణ జరపాలని కోరారు.
Next Story