Sun Mar 15 2026 22:06:41 GMT+0530 (India Standard Time)
నన్ను చంపేందుకు కడప బ్యాచ్ దిగింది
తనను చంపేందుకు కడప బ్యాచ్ దిగిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోందన్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని [more]
తనను చంపేందుకు కడప బ్యాచ్ దిగిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోందన్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని [more]

తనను చంపేందుకు కడప బ్యాచ్ దిగిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోందన్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తాను పిటీషన్ వేసినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. తనను చంపడానికి కడప బ్యాచ్ దిగిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొన్న బాబాయిని చంపారని, ఇప్పుడు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. వివేకా హత్యకేసులో విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని తాను సీబీఐకి లేఖ రాశానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు.
Next Story