Sat Dec 20 2025 07:48:41 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో?
జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. సీీబీఐ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ బెయిల్ [more]
జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. సీీబీఐ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ బెయిల్ [more]

జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. సీీబీఐ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఆయన పిటీషన్ లోకోరారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఈ పిటీషన్ వేశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఛార్జిషీట్లు అనేకం ఉన్నాయని, ట్రయల్ మాత్రం ఆలస్యంగా జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. జగన్ త్వరగా ఈ కేసుల నుంచి బయటపడాలనే తాను పిటీషన్ వేశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్ వేరొకరికి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు.
Next Story

