Sun Mar 15 2026 15:00:24 GMT+0530 (India Standard Time)
తాడేపల్లి ఆఫీసులోనే తనపై కుట్ర
ప్రతిపక్షనేత చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలంటేనే వైసీపీ ఎందుకు భయపడుతుందని ఆయన ప్రశ్నించారు. [more]
ప్రతిపక్షనేత చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలంటేనే వైసీపీ ఎందుకు భయపడుతుందని ఆయన ప్రశ్నించారు. [more]

ప్రతిపక్షనేత చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలంటేనే వైసీపీ ఎందుకు భయపడుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో మంటగలుపుతున్నారని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. తనను కూడా నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదయిన అన్ని కేసులపై హైకోర్టులో పిటీషన్ వేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ కుట్ర జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
Next Story