Thu Dec 25 2025 19:59:21 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాతో రఘురామ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు. రఘురామ కృష్ణ [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు. రఘురామ కృష్ణ [more]

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు. రఘురామ కృష్ణ రాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రఘురామ కృష్ణ రాజు మాత్రం తనపై వేటు పడదని ధీమాగా చెప్పారు. తాము నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదని ఆయన తెలిపారు. బెయిల్ రద్దు చేయమని కోరడం రాజద్రోహం ఎలా అవుతుందని రఘురామ కృష్ణ రాజు ప్రశ్నించారు. పెగసెస్ స్టాఫ్ట్ వేర్ తెప్పిచిందే వైసీపీ నేతలు అని అంటున్నారని, చాలా మందిపై దీనిని ఉపయోగించారని, మరి దీనికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా? అని రఘురామ కృష్ణ రాజు ప్రశ్నించారు.
Next Story

