Sun Mar 08 2026 05:05:04 GMT+0530 (India Standard Time)
నేను కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా
తాను బ్యాంకు రుణాలు ఎగవేశానంటూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నవారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడమేంటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి 17 కేసుల్లో నిందితులగా [more]
తాను బ్యాంకు రుణాలు ఎగవేశానంటూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నవారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడమేంటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి 17 కేసుల్లో నిందితులగా [more]

తాను బ్యాంకు రుణాలు ఎగవేశానంటూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నవారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడమేంటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి 17 కేసుల్లో నిందితులగా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాళ్లపై ఛార్జిషీట్లు కూడా నమోదయి ఉన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. వారు తనపై ఫిర్యాదు చేయడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. తాను కూడా వీరిద్దరు చేసిన లూటీ గురించి రాష్ట్రపతి, ప్రధానికి త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు.
Next Story