Thu Mar 19 2026 15:28:54 GMT+0530 (India Standard Time)
కేరళవాసులకు రాఘవ లారెన్స్ భారీ విరాళం

కేరళ వరద బాధితులకు దర్శకుడు రాఘవ లారెన్స్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో కేరళవాసులకు ఆపన్న హస్తం అందించారు. కేరళకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వయంగా కేరళ వెళ్లి అక్కడి ప్రజలకు సాయం చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ శనివారం కేరళ ముఖ్యమంత్రిని కలిసి విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. వీలైనంత త్వరగా కేరళ కోలుకోవాలని తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Next Story

