Fri Mar 20 2026 15:18:43 GMT+0530 (India Standard Time)
ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చిన బీజేపీ
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి భారతీయ జనతాపార్టీ షాక్ ఇచ్చింది. మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు బీజేపీ నేతలకు కేటాయించింది. దీంతో రంగస్వామి వర్గం ఆందోళనకు గురయింది. తమను [more]
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి భారతీయ జనతాపార్టీ షాక్ ఇచ్చింది. మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు బీజేపీ నేతలకు కేటాయించింది. దీంతో రంగస్వామి వర్గం ఆందోళనకు గురయింది. తమను [more]

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి భారతీయ జనతాపార్టీ షాక్ ఇచ్చింది. మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు బీజేపీ నేతలకు కేటాయించింది. దీంతో రంగస్వామి వర్గం ఆందోళనకు గురయింది. తమను సంప్రదించకుండానే నామినేటెడ్ ఎమ్మెల్యేల పోస్టులు ఎలా భర్తీ చేస్తారని రంగస్వామి వర్గం ప్రశ్నిస్తుంది. తమను కనీసం సంప్రదించకుండా ఎలా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని వారు నిలదీస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీలు కలసి పోటీ చేశాయి. రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిణామాలు కూటమి మధ్య చిచ్చు రేపే అవకాశం కన్పిస్తుంది.
Next Story