Sat Dec 06 2025 18:49:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నెలాఖరులో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు అండగా తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని నరేంద్ర మోదీ చెప్పారు.
రానున్న పార్లమెంటు సమావేశాల్లో....
మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మనస్ఫూర్తిగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని మోదీ తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోనుంది. రైతుల ఆందోళనలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలతో మోదీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పకతప్పదు. పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఈ మూడు వ్యవసాయ చట్టాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముందన్న నివేదికలు రావడంతోనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

