Mon Dec 08 2025 06:35:48 GMT+0000 (Coordinated Universal Time)
మరి కొన్ని రోజులు తప్పదు
భారత్ కు ఇది జీవన్మరణ సమస్య అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ [more]
భారత్ కు ఇది జీవన్మరణ సమస్య అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ [more]

భారత్ కు ఇది జీవన్మరణ సమస్య అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని మోడీ చెప్పారు. మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసమే తాము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరి కొన్ని రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిందేనని చెప్పారు. అందరం కలసి పోరాడితేనే దీన్నుంచి బయటపడగలమని మోడీ అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకోసం 24 గంటలూ కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు.
- Tags
- modi
- à°®à±à°¡à±
Next Story

