Tue Aug 09 2022 22:28:20 GMT+0000 (Coordinated Universal Time)
సపోర్ట్ ఎవరికి... మౌనం అందుకేనా?

రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడ్డాయి. అధికార, విపక్షాల అభ్యర్థులు ఖారారరయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చంద్రబాబు ఈ ఎన్నికపై ఇప్పటి వరకూ సైలెంట్ గానే ఉన్నారు. చంద్రబాబు పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించేందుకు ఈ సంఖ్య సరిపోకపోయినప్పటికీ రాజకీయంగా కీలక అంశంగానే చూడాలి.
నాడు హడావిడి...
ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఇద్దరూ రాజకీయ పార్టీల అధినేతలకు ఫోన్ లు చేసి మద్దతు కోరుతున్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎవరూ ఫోన్ చేయలేదు. మద్దతు కోరలేదు. అదే సమయంలో చంద్రబాబు కూడా ఈ ఎన్నికను పెద్దగా పట్టించుకోనట్లే కనపడుతున్నారు. ఒకనాడు రాష్ట్రపతి ఎన్నిక అంటే హడావిడి చేసే టీడీపీ అధినేత ఈసారి మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
చివరి నిమిషంలో...
అయితే అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు చివరి నిమిషంలో రాష్ట్రపతి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఎక్కువగా ఎన్డీఏ అభ్యర్థి వైపే ఆయన మొగ్గు చూపే అవకాశముంది. విపక్షాల అభ్యర్థి గెలిచే అవకాశాలు తక్కువగా ఉండటం, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కోరుకుంటుండటంతో చంద్రబాబు సపోర్ట్ ద్రౌపది ముర్ముకే ఉంటుందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కానీ ఇంత వరకూ చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోవడమే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.
Next Story