Mon Feb 02 2026 12:02:37 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజాం టీడీపీలో ముసలం...?

తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఒంగోలులో ధర్మ పోరాటదీక్ష చేస్తుంటే మరోవైపు మాజీ స్పీకర్ ప్రతిభాభారతిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రతిభాభారతికి వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వర్గం సమావేశమయింది. ప్రతిభాభారతిని ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని ఆ వర్గం తీర్మానం చేసింది. అంతేకాదు ప్రతిభా భారతి విషయంలో సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించింది. తెలుగుదేశంపార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Next Story
