Mon Mar 23 2026 00:55:47 GMT+0530 (India Standard Time)
టీడీపీకి కీలకనేత గుడ్ బై..

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో పట్టున్న ప్రతాప్ రెడ్డి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడే ప్రతాప్ రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వచ్చినా ఆయన చేరలేదు. ఆయన కాంగ్రెస్ లో చేరి రానున్న ఎన్నికల్లో గజ్వెల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Next Story

