Sun Mar 15 2026 07:42:58 GMT+0530 (India Standard Time)
పీకే ప్రాణాలకు ముప్పు?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించింది. ప్రశాంత్ కిషోర్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించింది. ప్రశాంత్ కిషోర్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించింది. ప్రశాంత్ కిషోర్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పశ్చిమ బెంగాల్ కు ఎన్నికలు జరుగుతుండటం, ఢిల్లీలో ఆప్ విజయానికి ప్రశాంత్ కిషోర్ కృషి చేయడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.
Next Story