Sun Mar 15 2026 03:11:02 GMT+0530 (India Standard Time)
ఆ పదవికి పీకే రాజీనామా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ ఎన్నికల్లో [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ ఎన్నికల్లో [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్ ను సలహాదారుగా నియమించారు. కేబినెట్ హోదాను కల్పించారు. కాకపోతే కొద్ది రోజులు తాను విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story