Sun Mar 15 2026 06:08:17 GMT+0530 (India Standard Time)
ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అందుకేనా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై వరస దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై కూడా ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరోసారి సర్వే చేయాలని ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ను జగన్ కోరినట్లు కూడా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్నది తెలుసుకోనున్నారు.
Next Story