ప్రకాష్ రాజ్ సంబరం ....!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. ఆయన ఆశించిన జేడీఎస్ సర్కార్ కొలువు తీరనుండటంతో ప్రకాష్ రాజ్ సంబరానికి కారణం. జస్ట్ ఆస్కింగ్ అంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికపై యుద్ధం చేస్తూ వస్తున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఎప్పుడు రాజకీయాలపై పెద్దగా స్పందించని ప్రకాష్ రాజ్ బెంగుళూర్ లో గౌరీ లంకేశ్ హత్య తరువాత తన గళం విప్పడం మొదలు పెట్టారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ విమర్శలు ఆరోపణలు గుప్పించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, గో రక్షక దళాల పేరుతో దాడులు ఇలా అనేక అంశాలపై మోడీ సర్కార్ పై విమర్శలు ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తూ ప్రజల్లో చర్చనీయాంశం అయ్యారు. సినిమాలే ప్రపంచంగా వుండే ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా సాగించిన ప్రచారం కర్ణాటక ప్రజల్లోనూ ఆలోచనను చర్చను లేవనెత్తింది. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా సాగించే యుద్ధం గుర్తించిన ప్రధాన మీడియా ఆయన తో ఇంటర్వ్యూలు తీసుకుని మరింత ప్రచారం చేసింది.
గులాబీ బాస్ తో కలిసి ...
ఇక దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్ తో చేతులు కలిపారు ప్రకాష్ రాజ్. బెంగళూరు లో జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామిలతో కేసీఆర్ భేటీలో పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ప్రకాష్ రాజ్. తనకు రాజకీయాలతో సంబంధం లేదని కానీ నిరంకుశత్వ విధానాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై మాత్రమే పోరాడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలపై ట్విట్టర్ లో తన ఆనందాన్ని నెటిజెన్స్ తో పంచుకున్నారు ఆయన. ప్రజాస్వామ్య పరిరక్షణ కు సుప్రీం కోర్ట్ నడుం కట్టడాన్ని స్వాగతించారు. స్వతహాగా కన్నడ ప్రాంతీయుడు కావడంతో కర్ణాటక రాజకీయాలపై పూర్తిగా తనదైన శైలిలో పోరాటం చేసి ఆశించిన ఫలితం రావడంతో ఇప్పడు ప్రకాష్ రాజ్ ఖుషి ఖుషీ. ఈ ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజారిటీ సాధించి ఉంటే ప్రకాష్ రాజ్ కాషాయ దళం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాలిసి వచ్చేది.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- just asking
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- Prakash Raj
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- జస్గ్ ఆస్కింగ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- ప్రకాశ్ రాజ్
- బి.ఎస్.యడ్యూరప్ప
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
