Sat Dec 06 2025 01:11:55 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తు లేకుండా టీడీపీ ఎప్పుడైనా గెలిచిందా?

పొత్తు లేకుండా టీడీపీ ఎప్పుడూ గెలవలేదని బీజేపీ నేత,కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేసిందని, ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారని జవదేకర్ ఎద్దేవా చేశారు. ఏపీకి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు. ఏపీకి సాయం ఎంతో చేశామని, ఇంకా చేస్తామని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థల పనులు ఏపీలో ప్రారంభమవు తున్నాయన్నారు. మిగిలిన పనులు కూడా శరవేగంతో పూర్తి చేస్తామని చెప్పారు. అనుమతులను శరవేగంతో ఇస్తామనిచెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఏపీకి ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని ఆయన అన్నారు.
Next Story
