Sun Mar 22 2026 15:29:06 GMT+0530 (India Standard Time)
డబ్బులు ఇవ్వనందుకే జేసీ సోదరుల కుట్ర

ఇటీవల తాడిపత్రిలో జరిగిన ఘర్షణల్లో తమకు పోలీసులు అన్యాయం చేస్తున్నారని ప్రభోదానంద స్వామి భక్తులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి వారు అమరావతికి పెద్దఎత్తున వచ్చారు. జేసీ అనుచరుల ఫిర్యాదుతో తమపై 30 కేసులు నమోదు చేసి 80 మంది భక్తులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తమపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ ఘర్షణలకు కారణమైన జేసీ సోదరులు, ఆయన అనుచరులపై మాత్రం కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. జేసీ సోదరులు తమ వద్ద డబ్బు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వనందుకే కుట్రతో దాడి చేయించారని పేర్కొన్నారు.
Next Story

