Sun Mar 22 2026 08:59:29 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై ప్రభోదానంద ఆరోపణలు

ఇటీవల తాడిపత్రిలో ప్రభోదానంద స్వామి - జేసీ దివాకర్ రెడ్డికి మధ్య యుద్ధమే జరిగింది. ఈ ఘర్షణల వ్యవహారంలో వీరిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయితే, జేసీ సోదరుల ఆగడాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదని ప్రభోదానంద స్వామి ఆరోపించారు. తాను గత ఎన్నికల్లో టీడీపీ కి సహకరించానని అయినా తనపై కక్ష కట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం జేసీ బ్రదర్స్ ను ఏమీ అనడం లేదని ఆయన ఆరోపించారు. తాడిపత్రిలో జరిగిన హింసకు జేసీ దివాకర్ రెడ్డినే కారణమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Next Story

