Tue Mar 24 2026 10:47:13 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు ఆ శాపం ఉందట...!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవించి ఉన్నంతకాలం నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉందని, అందుకే ఆయన నిజాలు చెప్పరని సినీనటుడు పోసాని కృష్ణమురళి సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్నడూ నిజం చెప్పరన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఆయన మాటలు నమ్మి ఓటేస్తే తెలంగాణలో అభివృద్ధి మరో యాభై ఏళ్లు వెనక్కు పోతుందన్నారు. తాను కూడా టీఆర్ఎస్ కే ఓటేస్తానని పోసాని కృష్ణమురళి చెప్పడం విశేషం. గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ పాలన బాగుందని పోసాని కితాబిచ్చారు.
Next Story

